65 ఇంచుల 4కె స్మార్ట్ ఎల్ఈడీ టీవీ రూ.49,990 కే..!


Sun,January 20, 2019 06:46 PM

షింకో ఇండియా భార‌త మార్కెట్‌లో 65 ఇంచుల నూతన 4కె స్మార్ట్ ఎల్ఈడీ టీవీని తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో ఎయిర్ క్లిక్ రిమోట్ ఫీచ‌ర్ ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల గదిలో ఏ మూల ఉన్నా రిమోట్‌ను ఆప‌రేట్ చేయ‌వ‌చ్చు. ఆండ్రాయిడ్ 7.0 ఆధారంగా ఈ టీవీ ప‌నిచేస్తుంది. ఇందులో 20 వాట‌ర్ల సౌండ్ బార్‌ను ఏర్పాటు చేశారు. దీనికి బూస్టెడ్ ట్వీటర్ల‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల సౌండ్ క్వాలిటీ బాగా ఉంటుంది. 1జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, బ్లూటూత్‌, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 1 ఈథ‌ర్‌నెట్ పోర్టు, వాయిస్ రికగ్నిష‌న్ త‌దిత‌ర ఫీచర్ల‌ను ఈ టీవీలో అందిస్తున్నారు. కాగా ఈ టీవీ అస‌లు ధ‌ర రూ.59,990 కాగా ప్ర‌స్తుతం అమెజాన్ లో గ్రేట్ ఇండియ‌న్ సేల్‌లో ఈ టీవీని రూ.49,990 ధ‌ర‌కే అందిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌కు టీవీ ల‌భిస్తుంది. త‌రువాత అస‌లు ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది.

5074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles