రూ.2490 కే కార్వాన్ మినీ 2.0 బ్లూటూత్ స్పీకర్, ఏఎం/ఎఫ్‌ఎం రేడియో..!


Sun,August 19, 2018 01:03 PM

కార్వాన్ మినీ 2.0 పేరిట సరిగమ కంపెనీ ఓ నూతన బ్లూటూత్ స్పీకర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో ఏఎం/ఎఫ్‌ఎం రేడియో సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే హిందీ సినిమాల్లోని 351 ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్స్‌ను ఇందులో అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను యాప్ ద్వారా ఈ స్పీకర్‌కు కనెక్ట్ చేసి ఫోన్‌లోని పాటలను ఈ స్పీకర్‌లో వినవచ్చు. లేదా పెన్ డ్రైవ్‌ను స్పీకర్‌కు కనెక్ట్ చేసి కూడా పాటలను వినవచ్చు. బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ 2.0, ఆక్స్ ఇన్, 4 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఈ స్పీకర్‌లో ఉన్నాయి. సన్‌సెట్ రెడ్, మూన్‌లైట్ బ్లాక్, రీగల్ బ్లూ, స్కైలైన్ బ్లూ, సఫైర్ గ్రీన్ కలర్ వేరియెంట్లలో ఈ స్పీకర్ రూ.2490 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్ నుంచి ప్రత్యేకంగా లభిస్తున్నది.

2502

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles