5వేల ప్రీలోడెడ్ సాంగ్స్‌తో.. సరిగమ కార్వాన్ 2.0 ఆడియో ప్లేయర్..


Wed,June 19, 2019 06:33 PM

సరిగమ కార్వాన్ ఆడియో ప్లేయర్ భారత మార్కెట్‌లో ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రీలోడెడ్ సాంగ్స్‌తో ఈ ప్లేయర్‌ను గతంలో అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత కార్వాన్ గో పేరిట మరో ఆడియో ప్లేయర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు సరిగమ కంపెనీ.. కార్వాన్ 2.0 పేరిట మరో కొత్త ఆడియో ప్లేయర్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 5వేల ప్రీలోడెడ్ సాంగ్స్‌ను అందిస్తున్నారు.

కార్వాన్ 2.0 ఆడియో ప్లేయర్‌లో వైఫై కనెక్టివిటీని అందిస్తున్నారు. దీంతో 150 రకాల ఆడియో స్టేషన్స్ నుంచి పలు విభాగాలకు చెందిన పాటలను వినవచ్చు. భక్తి, ఆరోగ్యం, జీవనశైలి, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాలకు చెందిన ఆడియోలను వినవచ్చు. ఇక ఈ ప్లేయర్‌లో యూఎస్‌బీ/ఆక్స్ ఇన్‌పుట్, ఎఫ్‌ఎం/ఏఎం, బ్లూటూత్ తదితర ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఈ ప్లేయర్‌ను ఒక్కసారి చార్జింగ్ పెడితే 5 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. కాగా ఈ ప్లేయర్‌ను రూ.7,990 ప్రారంభ ధరకు త్వరలో విక్రయించనున్నారు.

1736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles