వైర్‌లెస్ ప‌వ‌ర్ బ్యాంక్‌, చార్జ‌ర్ ప్యాడ్‌లను విడుద‌ల చేసిన శాంసంగ్


Wed,May 22, 2019 04:14 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్.. వైర్‌లెస్ ప‌వ‌ర్ బ్యాంక్ పేరిట ఓ నూత‌న ప‌వ‌ర్ బ్యాంక్‌ను, వైర్‌లెస్ చార్జింగ్ డ్యుయో ప్యాడ్ పేరిట ఓ చార్జ‌ర్ ప్యాడ్‌ను భార‌త మార్కెట్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. ప‌వ‌ర్‌బ్యాంక్ 10,000 ఎంఏహెచ్ కెపాసిటీని క‌లిగి ఉండ‌గా, దీంతో ఏక‌కాలంలో రెండు డివైస్‌ల‌ను చార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. అడాప్టివ్ ఫాస్ట్ చార్జింగ్‌కు ఇందులో స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డివైస్‌లు వేగంగా చార్జింగ్ అవుతాయి. ఇక వైర్‌లెస్ చార్జ‌ర్ డ్యుయో ప్యాడ్ స‌హాయంతో గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. క్యూఐ స‌ర్టిఫైడ్ డివైస్‌ల‌ను కూడా ఈ ప్యాడ్ తో చార్జింగ్ చేసుకోవ‌చ్చు. కాగా శాంసంగ్ వైర్‌లెస్ ప‌వర్ బ్యాంక్ ధ‌ర రూ.3,699 ఉండ‌గా, వైర్‌లెస్ చార్జ‌ర్ డ్యుయో ప్యాడ్ ధ‌ర రూ.5,999గా ఉంది. వీటిని త్వ‌ర‌లో విక్ర‌యించ‌నున్నారు.

1885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles