డ్యుయల్ డిస్‌ప్లేలతో విడుదలైన శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్


Mon,November 12, 2018 11:17 AM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ డబ్ల్యూ 2019 ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 4.2 ఇంచుల సైజ్ ఉన్న రెండు డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. ఇది ఫ్లిప్ ఫోన్ కాగా, ఇందులో స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌లను అమర్చారు. అందువల్ల ఈ ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్ పూర్తిగా 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కు పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 3070 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. శాంసంగ్ డబ్ల్యూ 2019 స్మార్ట్‌ఫోన్ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్ ధర రూ.1,98,720 గా ఉంది.

శాంసంగ్ డబ్ల్యూ2019 ఫీచర్లు...
4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డ్యుయల్ డిస్‌ప్లేలు, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3070 ఎంఏహెచ్ బ్యాటరీ.

1543

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles