ఈ నెల 26 నుంచి గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ల విక్ర‌యం


Sun,April 14, 2019 04:08 PM

శాంసంగ్ కంపెనీ త‌న గెలాక్సీ ఫోల్డ్ మ‌డ‌త‌బెట్టే ఫోన్‌ను గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ ప్ర‌దర్శ‌న‌లో లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెరికా మార్కెట్‌లో ల‌భ్యం కానుంది. అందుకుగాను రేప‌టి నుంచి ఈ ఫోన్‌కు ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించ‌నున్నారు. శాంసంగ్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. యూఎస్‌లో ఏటీ అండ్ టీ, టి-మొబైల్‌లు ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నాయి. 1980 డాల‌ర్ల‌కు (దాదాపుగా రూ.1,40,760) ఈ ఫోన్‌ను యూజ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లో 7.3 ఇంచుల ప్రైమ‌రీ డిస్‌ప్లే, 4.6 ఇంచుల సెకండ‌రీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌, 4380 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ త‌దిత‌ర అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక శాంసంగ్‌కు చెందిన ఎస్10 5జీ వేరియెంట్‌ను మే నెల‌లో అమెరికా మార్కెట్‌లో విక్ర‌యించ‌నున్నారు. కాగా గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ ఇత‌ర దేశాల్లో ల‌భ్య‌మ‌య్యే తేదీల‌ను శాంసంగ్ కంపెనీ వెల్ల‌డించ‌లేదు.

2496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles