బెంగళూరులో శాంసంగ్ మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్.. ప్రపంచంలోనే అతి పెద్దది..!


Tue,September 11, 2018 03:25 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను బెంగళూరులో ఇవాళ ఓపెన్ చేసింది. బెంగళూరులో ఉన్న ఓపెరా హౌస్‌లో ఈ సెంటర్‌ను శాంసంగ్ ప్రారంభించింది. ఓపెరా హౌస్ నిజానికి బ్రిటిష్ వారి కాలం నాటిది. అప్పట్లో అందులో నాటకాలు వేసే వారు. కానీ దానికి రెండు సంవత్సరాల నుంచి మరమ్మత్తులు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అందులో శాంసంగ్ తన మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ఓపెన్ చేసింది.

శాంసంగ్ మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లో వినియోగదారులు శాంసంగ్‌కు చెందిన అన్ని రకాల ప్రొడక్ట్స్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్ యాక్ససరీలు తదితర అన్ని రకాల ప్రొడక్ట్స్‌ను కస్టమర్లు పరిశీలించవచ్చు. అలాగే సెంటర్‌లో ఉన్న 4డీ స్వే చెయిర్‌లో వర్చువల్ రియాలిటీ అనుభూతి చెందవచ్చు. దీంతోపాటు విప్‌లాష్ పల్సర్ 4డీ చెయిర్‌లో గేమ్స్ ఆడవచ్చు. అదేవిధంగా సెంటర్‌లో ఉన్న హోమ్ థియేటర్ జోన్‌లో సినిమాలు, షోలను వీక్షించేందుకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక సెంటర్‌లో ఉన్న కిచెన్ ఏరియాలో పలువురు చెఫ్‌లు శాంసంగ్ ఉత్పత్తులతో లైవ్ కుకింగ్ ప్రదర్శనలు ఇస్తారు. కాగా శాంసంగ్‌కు భారత్‌లో రెండు మానుఫాక్చరింగ్ ఫెసిలిటీలు ఉండగా, 5 ఆర్ అండ్ డీ సెంటర్‌లు, ఒక డిజైన్ సెంటర్ ఉంది. ఈ మధ్యే నోయిడాలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన మొబైల్ ఫ్యాక్టరీని శాంసంగ్ ప్రారంభించింది.1567

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles