శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై రూ.8వేల పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్..!


Sun,December 10, 2017 12:26 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్‌లోని పలు స్మార్ట్‌ఫోన్లను కొన్న వినియోగదారులకు రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నది. క్రిస్‌మస్ కార్నివాల్ పేరిట శాంసంగ్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు శాంసంగ్ స్టోర్‌కు వెళ్లి గెలాక్సీ సిరీస్‌లో ఏదైనా ఫోన్ కొన్నాక స్టోర్‌లో పేటీఎం మాల్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అనంతరం అందులో తాము కొన్న ప్రొడక్ట్ డిటెయిల్స్‌ను నింపాలి. దీంతో వెంటనే యూజర్ల పేటీఎం వాలెట్‌లోకి రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక దీంతోపాటు ఇతర ఆఫర్లను కూడా శాంసంగ్ అందిస్తున్నది.

శాంసంగ్ సంస్థ తన గేర్ ఫిట్ 2ప్రొ, గేర్ స్పోర్ట్ స్మార్ట్‌వాచ్‌లకు గాను క్రెడిట్ కార్డ్ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను అందిస్తున్నది. దీంతోపాటు రూ.10వేలు ఆపైన విలువ గల వస్తువులను వినియోగదారులు ఈఎంఐ పద్ధతిలో బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే కొత్త ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 40 శాతం బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్ లభిస్తున్నది. యూజర్లు కొన్న స్మార్ట్‌ఫోన్లకు 1 సంవత్సరం పాటు ఉచిత యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నారు. మొబిక్విక్ యూజర్లకు 10 శాతం సూపర్ క్యాష్ ఆఫర్‌ను కూడా శాంసంగ్ అందిస్తున్నది.

4372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles