రూ.42 వేల‌కే శాంసంగ్ 43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ


Tue,March 12, 2019 04:58 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఎన్‌యూ6100 సిరీస్‌లో 3 నూత‌న 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీల‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. 43, 50, 55 ఇంచుల డిస్‌ప్లే సైజ్ ఉన్న మోడ‌ల్స్‌లో ఈ టీవీలు వినియోగ‌దారుల‌కు లభిస్తున్నాయి. వీటిల్లో లైవ్ క్యాస్ట్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని స‌హాయంతో ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా స‌రే స్మార్ట్‌ఫోన్ ద్వారా లైవ్ వీడియోను పెడితే దాన్ని ఈ టీవీల్లో చూడ‌వ‌చ్చు. ఇక వీటిలో వైఫై, హెచ్‌డీఎంఐ, డాల్బీ డిజిట‌ల్ ప్ల‌స్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. అలాగే ఈ మూడు టీవీల్లో 4కె అల్ట్రా హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ ల‌భిస్తున్న‌ది. కాగా 43 ఇంచుల టీవీ ధ‌ర రూ.41,990 ఉండ‌గా, 50 ఇంచుల టీవీని రూ.51,990 కి, 55 ఇంచుల మోడ‌ల్ టీవీని రూ.61,990 ధ‌ర‌కు అందిస్తున్నారు. ఈ టీవీల‌ను ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్ ఆన్‌లైన్ షాప్‌, అమెజాన్‌ల‌లో కొనుగోలు చేస్తే రూ.2వేల వ‌రకు డిస్కౌంట్ ఇస్తారు. ఇక ఈ ఆఫ‌ర్ ఈ నెల 14 వ‌ర‌కే అందుబాటులో ఉంటుంది..!

2346

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles