ఒడిస్సీ జడ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన శాంసంగ్


Wed,September 19, 2018 03:39 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఒడిస్సీ జడ్ పేరిట ఓ నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను అమెరికా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1060 6జీబీ గ్రాఫిక్స్ మెమొరీ, 16 జీబీ ర్యామ్, ఇంటెల్ కోర్ ఐ7 8వ జనరేషన్ ప్రాసెసర్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌కు ఉన్న కీబోర్డును డెస్క్‌టాప్ కీ బోర్డు ఫీల్ వచ్చేలా డిజైన్ చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునేలా కూలింగ్ డిజైన్‌ను ఈ ల్యాప్‌టాప్ కలిగి ఉంది. అలాగే 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, హెచ్‌డీ వెబ్ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, 54 వాట్ అవర్ బ్యాటరీ తదితర ఇతర ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో లభిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.1,31,145 గా ఉంది. త్వరలో అమెజాన్, మైక్రోసాఫ్ట్ స్టోర్‌లలో భారత్‌లోనూ ఈ ల్యాప్‌టాప్ లభ్యం కానుంది.

942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles