వ‌చ్చేస్తున్నాయ్‌.. గెలాక్సీ ఎస్10 ఫోన్లు.. లాంచింగ్ నేడే..!


Wed,February 20, 2019 04:24 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న గెలాక్సీ ఎస్ సిరీస్‌లో నూత‌న ఫ్లాగ్ షిప్ ఫోన్ల‌యిన గెలాక్సీ ఎస్‌10, ఎస్‌10 ప్ల‌స్ ల‌ను నేడు విడుద‌ల చేయ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం నేటి అర్థ‌రాత్రి 12.30 గంట‌ల‌కు శాన్ ఫ్రాన్సిస్కోతోపాటు లండ‌న్ లోనూ ఏక‌కాలంలో నిర్వ‌హించ‌నున్న ఈవెంట్ల‌లో శాంసంగ్ త‌న గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. ఫోన్లు విడుద‌లైన త‌క్ష‌ణ‌మే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్లో ఈ ఫోన్ల‌కు గాను ప్రీ రిజిస్ట్రేష‌న్ల‌ను కూడా ప్రారంభించ‌నున్నారు.

శాంసంగ్ విడుద‌ల చేయ‌నున్న గెలాక్సీ ఎస్‌10 ఫోన్‌లో 6.1 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 855 లేదా ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్‌, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, రివ‌ర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 12, 13 మెగాపిక్స‌ల్ ట్రిపుల్‌ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.73,500 ఉండ‌నున్న‌ట్లు తెలిసింది. అలాగే గెలాక్సీ ఎస్10 ప్ల‌స్ ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్ డ్రాగ‌న్ 855 లేదా ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. ఇక ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.79,900 గా ఉండ‌నుందని స‌మాచారం.

గెలాక్సీ ఎస్‌10, ఎస్‌10 ప్ల‌స్ ఫోన్ల‌తోపాటు శాంసంగ్ ఇదే ఎస్‌10 సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌10ఇ ఫోన్‌ను కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. అందులో 5.8 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9.0 పై, స్నాప్‌డ్రాగ‌న్ 855 లేదా ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. అలాగే ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.59,900 గా ఉండ‌నుంద‌ని స‌మాచారం. ఇక ఇవే కాకుండా శాంసంగ్ త‌న ఈవెంట్ల‌లో గెలాక్సీ ఫోల్డ్ పేరిట మ‌డ‌త‌బెట్టే స్మార్ట్ ఫోన్‌ను, గెలాక్సీ బ‌డ్స్ పేరిట వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిసింది. గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.1.82 ల‌క్ష‌లు ఉండ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, గెలాక్సీ బ‌డ్స్ ధ‌ర వివ‌రాలు తెలియ‌లేదు.

2453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles