శాంసంగ్ కొత్త ఎల్‌ఈడీ హోమ్ స్క్రీన్.. ధర రూ.1 కోటి..!


Tue,September 18, 2018 05:14 PM

ప్రపంచంలోనే మొదటి ఎల్‌ఈడీ హోమ్ స్క్రీన్‌ను శాంసంగ్ ఇవాళ భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. యాక్టివ్ ఎల్‌ఈడీ పేరిట ఈ హోమ్ స్క్రీన్‌ను శాంసంగ్ లాంచ్ చేసింది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో శాంసంగ్ ఈ స్క్రీన్‌ను ఒక విప్లవంగా పేర్కొంది. అత్యద్భుతమైన, అత్యంత నాణ్యత కలిగిన దృశ్యాలను ఈ హోమ్ స్క్రీన్‌పై వినియోగదారులు చూడవచ్చు. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ హోమ్ స్క్రీన్ ఇస్తుంది.

110, 130, 220, 260 ఇంచుల మోడల్స్‌లో ఈ ఎల్‌ఈడీ హోమ్‌స్క్రీన్‌లను శాంసంగ్ లాంచ్ చేసింది. 110, 130 ఇంచుల మోడల్స్‌లో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అలాగే 220, 260 ఇంచుల మోడల్స్‌లో అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. ఈ హోమ్ స్క్రీన్లు అన్నింటికీ 1 లక్షకు పైగా గంటల జీవిత కాలం ఉంటుందని శాంసంగ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ హోమ్ స్క్రీన్ల ధర రూ.1 కోటి నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉంటుందని వారు తెలిపారు.

2272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles