రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసిన శాంసంగ్


Thu,November 30, 2017 05:04 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ గేర్ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లను తాజాగా విడుదల చేసింది. 'గేర్ ఫిట్ 2 ప్రొ, గేర్ స్పోర్ట్' పేరిట ఈ రెండు వాచ్‌లు విడుదలయ్యాయి. ఈ వాచ్‌లు వరుసగా రూ. 13,590, రూ.22,990 ధరలకు లభిస్తున్నాయి. అమెజాన్ సైట్‌లో వీటిని యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గేర్ ఫిట్2 ప్రొ ఫీచర్లు...


1.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 216 x 432 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్, వాటర్ రెసిస్టెన్స్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ ప్లేయర్, బ్లూటూత్ 4.2, హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్, 200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 రోజుల బ్యాటరీ లైఫ్.

శాంసంగ్ గేర్ స్పోర్ట్ ఫీచర్లు...


1.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 360 x 360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కనెక్టివిటీ, వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, హార్ట్ రేట్ సెన్సార్, బారో మీటర్, 300 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్.

2654

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles