నూతన వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను విడుదల చేసిన శాంసంగ్


Mon,July 30, 2018 01:17 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ గేర్ ఐకాన్ ఎక్స్ 2018 పేరిట నూతన వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.13,990 ధరకు ఈ ఇయర్ బడ్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. ఈ బడ్స్‌లో 4జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. అందులో దాదాపుగా 1000 పాటలను సేవ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌తోపాటు పలు ఇతర భాషల్లో వాయిస్ గైడ్ సపోర్ట్‌ను వీటిల్లో అందిస్తున్నారు. బ్లూటూత్ 4.2 టెక్నాలజీ ఆధారంగా ఈ ఇయర్ బడ్స్ పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 4.4 లేదా ఐఓఎస్ డివైస్‌లకు ఈ బడ్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బడ్స్‌లో 82 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. ఒకసారి వీటిని ఫుల్ చార్జ్ చేస్తే 7 గంటల వరకు వాడుకోవచ్చు.

2773

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles