గెలాక్సీ వాచ్‌ను విడుదల చేసిన శాంసంగ్


Sat,September 22, 2018 03:57 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌వాచ్ గెలాక్సీ వాచ్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. 46ఎంఎం, 42ఎంఎం ఆప్షన్లలో, 1.3 ఇంచ్, 1.2 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో ఈ వాచ్ యూజర్లకు లభిస్తున్నది. ఇందులో డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. టైజన్ ఆధారిత ఓఎస్ ఆధారంగా ఈ వాచ్ పనిచేస్తుంది. 5 ఏటీఎం + ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఈ వాచ్‌లో ఏర్పాటు చేశారు.

గెలాక్సీ వాచ్ మిలిటరీ స్థాయి మన్నికను కలిగి ఉంటుంది. ఇందులో బిల్ పేమెంట్స్ కోసం ఎన్‌ఎఫ్‌సీ సదుపాయాన్ని కల్పించారు. శాంసంగ్ పే ఆధారంగా ఇది పనిచేస్తుంది. అలాగే వాయిస్ మెసేజ్‌లను పంపుకునేందుకు, మ్యూజిక్ వినేందుకు ఈ వాచ్‌లో బిల్టిన్ స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. జీపీఎస్ సదుపాయం కూడా ఆ వాచ్‌లో ఉంది.

ఈ వాచ్‌లో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ట్రాకర్ అనే ఆకట్టుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇది యూజర్లకు ఎదురయ్యు స్ట్రెస్‌ను ట్రాక్ చేస్తుంది. అందుకు అనుగుణంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయమని చెబుతుంది. దీంతోపాటు స్లీప్ మానిటర్, 21 ఎక్సర్‌సైజ్‌లను ట్రాక్ చేసే ట్రాకర్, 39 వర్కవుట్స్ ట్రాకర్, క్యాలరీ కౌంటర్ వంటి సదుపాయాలు కూడా గెలాక్సీ వాచ్‌లో ఉన్నాయి. ఈ వాచ్‌కు చెందిన 46 ఎంఎం మోడల్‌లో 472 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేయగా ఇది 80 గంటల వరకు యూసేజ్‌ని ఇస్తుంది. అలాగే 42 ఎంఎం మోడల్‌లో 270 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది 45 గంటల యూసేజ్‌ను ఇస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ ఫీచర్లు...

1.2/1.3 ఇంచ్ సర్క్యులర్ సూపర్ అమోలెడ్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, 360 x 360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.15 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ఎగ్జినోస్ 9110 ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, టైజన్ ఆధారిత ఓఎస్ 4.0, ఆండ్రాయిడ్ 5.0, ఐఫోన్ 5 కంపాటబిలిటీ, 5ఏటీఎం+ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, హార్ట్ రేట్ సెన్సార్, బారో మీటర్, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 472/270 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 46 ఎంఎం వేరియెంట్ ధర రూ.29,990 ఉండగా, 42 ఎంఎం ధర రూ.24,990గా ఉంది.

1791

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles