గెలాక్సీ వాచ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ ను విడుద‌ల చేసిన శాంసంగ్


Thu,February 21, 2019 12:29 PM

శాంసంగ్ కంపెనీ త‌న గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్ల విడుద‌ల ఈవెంట్ లో గెలాక్సీ వాచ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్‌ను కూడా విడుద‌ల చేసింది. ఇందులో ఎక్స‌ర్‌సైజ్‌, స్లీప్‌, స్ట్రెస్ ట్రాక‌ర్లు, బీపీ మానిట‌ర్‌, 1.1 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఎగ్జినోస్ డ్యుయ‌ల్ కోర్ 1.15 గిగాహెడ్జ్ ప్రాసెస‌ర్‌, 768 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ స్టోరేజ్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 230 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. సిల్వ‌ర్‌, బ్లాక్‌, రోజ్ గోల్డ్‌, సీ గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో రూ.14,200 ధ‌ర‌కు ఈ వాచ్ మార్చి 8వ తేదీ నుంచి వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఈ వాచ్‌ను ప్రీ ఆర్డ‌ర్ చేసే వారికి ఉచితంగా వైర్‌లెస్ చార్జింగ్ పాడ్‌ను అందిస్తున్నారు. ప్రీ ఆర్డ‌ర్లు మార్చి 7వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

1019

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles