శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 (2019) ట్యాబ్లెట్ విడుదల


Mon,June 24, 2019 06:48 PM

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 (2019) పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై వేరియెంట్ ధర రూ.14,999 ఉండగా దీన్ని ఈ నెల 26వ తేదీ నుంచి కేవలం అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్స్‌లో మాత్రమే విక్రయించనున్నారు. అలాగే ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై+4జీ వేరియెంట్ ధర రూ.19,999 ఉండగా దీన్ని జూలై 1 నుంచి విక్రయించనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 (2019) ఫీచర్లు...


10.1 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6150 ఎంఏహెచ్ బ్యాటరీ.

860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles