శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 (2019) ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ విడుద‌ల


Mon,February 18, 2019 05:44 PM

శాంసంగ్ త‌న నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 2019 ను ఇవాళ జ‌ర్మ‌నీ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 10.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 8, ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. ఈ ట్యాబ్ వైఫై, 4జీ వేరియెంట్ల‌లో విడుద‌లైంది. యూఎస్‌బీ టైప్ సి, 6150 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ స‌దుపాయాల‌ను ఈ ట్యాబ్‌లో అందిస్తున్నారు. ఇక ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై వేరియెంట్ ధ‌ర రూ.16,960 ఉండ‌గా, 4జీ వేరియెంట్ ధ‌ర రూ.21,830 గా ఉంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ ట్యాబ్‌ను విక్ర‌యించ‌నున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 2019 ఫీచ‌ర్లు...



10.1 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 1920 ×1200 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, వైఫై డైరెక్ట్‌, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6150 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

2241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles