ఫేస్‌ఐడీకి దీటుగా గెలాక్సీ ఎస్9లో ఫోన్‌ అన్‌లాక్ ఫీచర్ ?


Mon,November 20, 2017 08:07 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తాను వచ్చే ఏడాది లాంచ్ చేయనున్న గెలాక్సీ ఎస్9 ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను యాపిల్ ఫేస్ ఐడీకి దీటుగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిసింది. అయితే గెలాక్సీ ఎస్8లో ఉన్న ఫ్రంట్ కెమెరా, ఐరిస్ స్కానర్ హార్డ్‌వేర్‌లో ఎలాంటి మార్పు చేయకుండా కేవలం సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేయడం ద్వారానే ఈ ఫీచర్‌ను మరింత మెరుగ్గా అందించనుందని తెలుస్తున్నది. ఐఫోన్ 10లో ఉన్న యాపిల్ ఫేస్‌ఐడీ ఫీచర్ యూజర్ ముఖాన్ని ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ సహాయంతో 3డీ స్కాన్ చేస్తుంది. అదే గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్, నోట్ 8 ఫోన్లలో అయితే ముందు భాగంలో ఉన్న కెమెరా ఐరిస్ స్కానర్‌కు కనెక్ట్ అయి యూజర్ ముఖాన్ని స్కాన్ చేసి డివైస్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఈ క్రమంలోనే శాంసంగ్ తాను వచ్చే ఏడాది విడుదల చేయనున్న గెలాక్సీ ఎస్9లో ఐరిస్ స్కానర్‌ను మరింత మెరుగ్గా, వేగంగా పనిచేసేలా డిజైన్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో యాపిల్ ఫేస్‌ఐడీకి గట్టి పోటీనివ్వాలని శాంసంగ్ భావిస్తున్నది. ఇప్పటికే కొందరు వ్యక్తులు యాపిల్ ఫేస్ ఐడీని 3డీ ప్రింటర్ మాస్క్‌ల సహాయంతో అన్‌లాక్ చేసి ఆ ఫీచర్‌ను హ్యాక్ చేశారు. అయితే ఇలా కాకుండా ఉండేలా మరింత పకడ్బందీగా ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను శాంసంగ్ రూపొందిస్తున్నట్టు సమాచారం. దీనిపై మ‌రిన్ని విష‌యాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

1641

More News

VIRAL NEWS