గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఐస్ బ్లూ కలర్ వేరియెంట్లు విడుదల


Wed,November 14, 2018 11:51 AM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లకు చెందిన ఐస్ బ్లూ కలర్ వేరియెంట్లను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్లు మిడ్‌నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ, లైలాక్ పర్పుల్, సన్‌రైజ్ గోల్డ్, బర్గండీ రెడ్ కలర్ వేరియెంట్లలో లభిస్తుండగా, వీటికి అదనంగా ఐస్ బ్లూ కలర్ వేరియెంట్ వచ్చి చేరింది. ఈ వేరియెంట్ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తున్నది. దీని ధర రూ.57,425 గా ఉంది. ఈ నెల 26వ తేదీ నుంచి వినియోగదారులకు ఈ వేరియెంట్ లభ్యం కానుంది.

1005

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles