మార్చి 8 నుంచి గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల విక్ర‌యాలు.. లాంచింగ్ ఆఫ‌ర్లివే..!


Sat,February 23, 2019 11:39 AM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న గెలాక్సీ ఎస్10, ఎస్‌10 ప్ల‌స్‌, ఎస్10ఇ ఫోన్ల‌ను రెండు రోజుల కింద‌ట విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్ల‌కు గాను భార‌త్‌లో ధ‌ర‌ల‌ను శాంసంగ్ వెల్లడించింది. ఆ వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

గెలాక్సీ ఎస్10ఇ - 6జీబీ, 128 జీబీ - రూ.55,900
గెలాక్సీ ఎస్10 - 8జీబీ, 128 జీబీ - రూ.66,900
గెలాక్సీ ఎస్‌10 - 8జీబీ, 512 జీబీ - రూ.84,900
గెలాక్సీ ఎస్10 ప్ల‌స్ - 8జీబీ, 128 జీబీ - రూ.73,900
గెలాక్సీ ఎస్‌10 ప్ల‌స్ - 8జీబీ, 512 జీబీ (సెరామిక్ బ్లాక్‌) - రూ.91,900
గెలాక్సీ ఎస్‌10 ప్ల‌స్ - 12జీబీ, 1 టీబీ (సెరామిక్ వైట్‌) - రూ.1,17,900

ఈ ఫోన్ల‌కు గాను ప్రీ ఆర్డ‌ర్ల‌ను నిన్న‌టి నుంచి ప్రారంభించారు. ప్రీ ఆర్డ‌ర్ చేసిన వారికి మార్చి 6 నుంచి ఫోన్ల‌ను డెలివ‌రీ చేస్తారు. అలాగే మార్చి 8వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ స్టోర్ల‌లో ఈ ఫోన్ల‌ను విక్ర‌యించ‌నున్నారు.

లాంచింగ్ ఆఫ‌ర్లు...


* గెలాక్సీ ఎస్10 ఫోన్ల‌ను ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి గెలాక్సీ వాచ్ ను త‌గ్గింపు ధ‌ర‌కు అందిస్తున్నారు. కేవ‌లం రూ.9,999 ధ‌ర‌కే ఆ వాచ్‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. లేదా శాంసంగ్ బ‌డ్స్‌ను రూ.2,999 కే ఇస్తారు.
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల‌తో ఫోన్ల‌ను కొంటే రూ.6వేల క్యాష్ బ్యాక్ ఇస్తారు. గెలాక్సీ ఎస్10ఇ ఫోన్‌కు అయితే రూ.4వేల క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.
* ఈ ఫోన్ల‌పై 3, 6, 9 నెల‌ల కాల వ్య‌వ‌ధి గ‌ల నో ఎక్స్‌ట్రా కాస్ట్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే 12, 18, 24 కాల వ్య‌వ‌ధి గ‌ల లో కాస్ట్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్‌ల‌ను కూడా అందిస్తున్నారు.
* పాత ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గ‌రిష్టంగా రూ.15వేల వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ను పొంద‌వ‌చ్చు.

2064

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles