భారత్‌లో గెలాక్సీ నోట్ 9 ధర ఎంతో తెలుసా..?


Sun,August 12, 2018 01:10 PM

శాంసంగ్ సంస్థ గత 3 రోజుల క్రితమే తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9ను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా భారత్‌లో ఈ ఫోన్ లభ్యమయ్యే తేదీ, ధర వివరాలను ఇప్పుడు వెల్లడించింది. మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ బ్లూ, మెటాలిక్ కాపర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కాగా దీనికి చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర భారత్‌లో రూ.67,900 గా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.84,900 గా ఉంది. ఈ మోడల్స్‌కు గాను ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఆర్డర్లు కొనసాగుతాయి. అనంతరం ముందుగా బుక్ చేసుకున్న వారికి ఫోన్లను డెలివరీ ఇస్తారు. తరువాత అన్ని మాధ్యమాల్లోనూ గెలాక్సీ నోట్ 9 గాను విక్రయాలు ప్రారంభమవుతాయి.

గెలాక్సీ నోట్ 9 ఫోన్‌ను ప్రీ ఆర్డర్‌లో కొన్న కస్టమర్లకు రూ.22,990 విలువైన శాంసంగ్ గేర్ స్పోర్ట్ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ.4,999 ధరకే అందిస్తున్నారు. పేటీఎం మాల్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.6వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ లేదా కన్‌జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ద్వారా ఈ ఫోన్‌ను కొంటే రూ.6వేలు క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఇతర శాంసంగ్ ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అదనంగా రూ.6వేల వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు...
6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ (గ్లోబల్ వేరియెంట్)/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెసర్ (ఇండియన్ వేరియెంట్), 6/8 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్, బారో మీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

5114

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles