ఈ నెల 22న భారత్‌లో విడుదల కానున్న గెలాక్సీ నోట్ 9


Sat,August 18, 2018 03:47 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను ఈ నెల 22వ తేదీన భారత్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేయనున్నారు. మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ బ్లూ, మెటాలిక్ కాపర్ (128 జీబీ వేరియెంట్) కలర్లలో గెలాక్సీ నోట్ 9 భారత్‌లో విడుదల కానుంది. ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.67,900 ధరకు లభ్యం కానుండగా, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.84,900 ధరకు లభ్యం కానుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఇప్పటికే ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీ వరకు ప్రీ ఆర్డర్లకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో గెలాక్సీ నోట్ 9 ను ప్రీ ఆర్డర్ చేసే కస్టమర్లకు పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు...

6.4 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9810 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, బారో మీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్.

1925

More News

VIRAL NEWS