భారత్‌లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ నోట్ 9


Wed,August 22, 2018 02:15 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను గత కొద్ది రోజుల కిందట గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను భారత్‌లో ఇవాళ అధికారికంగా లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.67,900 ధరకు, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.84,900 ధరకు లభిస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి పలు ఆఫర్లను అందిస్తున్నారు. పేటీఎం మాల్‌లో ఫోన్ కొంటే రూ.6వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ఫోన్‌ను కొంటే రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే పాత శాంసంగ్ ఫోన్‌ను తెచ్చిస్తే దానిపై రూ.6వేల వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు...
6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారో మీటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

1907

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles