శాంసంగ్ మడతబెట్టే ఫోన్.. అక్టోబర్ 1న భారత మార్కెట్లోకి..!


Tue,September 24, 2019 03:52 PM

స్మార్ట్‌ఫోన్ ప్రియులంతా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శాంసంగ్‌కు చెందిన మడతబెట్టే ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ఎట్టకేలకు భారత్‌లో లభ్యం కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి శాంసంగ్ ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విక్రయించనుంది. కేవలం ప్రీ-బుకింగ్ విధానంలోనే ఈ ఫోన్‌ను శాంసంగ్ విక్రయించనుందని తెలిసింది. కాగా భారత్‌లో గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ రిలీజై ఎంతో కాలమైనప్పటికీ ఇందులో ఉన్న పలు లోపాల వల్ల ఫోన్ మార్కెట్‌లోకి రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే అన్ని లోపాలను సరి చేసిన శాంసంగ్ తన గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌ను గత నెల కిందటే దక్షిణ కొరియా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇక త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ లభ్యం కానుంది. కాగా గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లో 7.3 ఇంచుల ప్రైమరీ డిస్‌ప్లే, 4.6 ఇంచుల సెకండరీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles