గెలాక్సీ ఫిట్ స్మార్ట్‌బ్యాండ్‌ను లాంచ్ చేసిన శాంసంగ్


Thu,February 21, 2019 01:21 PM

శాంసంగ్ కంపెనీ.. గెలాక్సీ ఫిట్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ బ్యాండ్‌ను నిన్న రాత్రి జ‌రిగిన గెలాక్సీ ఎస్10 ఈవెంట్‌లో విడుద‌ల చేసింది. ఈ బ్యాండ్ లో 90 ర‌కాల భిన్నమైన యాక్టివిటీల‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు. ఆ స‌మాచారాన్ని స్మార్ట్‌ఫోన్ లో ఉండే శాంసంగ్ హెల్త్ యాప్ ద్వారా స్వీక‌రించి డేటాను స్టోర్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ బ్యాండ్‌లో యూజ‌ర్లు త‌మ త‌మ ఫోన్ల ద్వారా మెసేజ్ లు ఇత‌ర అల‌ర్ట్స్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఇందులో 0.95 ఇంచుల డిస్‌ప్లే, 512 కేబీ ఇంటర్న‌ల్ ర్యామ్‌, 2048 కేబీ ఎక్స్‌ట‌ర్న‌ల్ ర్యామ్‌, 32 ఎంబీ స్టోరేజ్‌, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్‌, హార్ట్ రేట్ మానిట‌ర్, 120 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 5 ఏటీఎం వాట‌ర్ రెసిస్టెన్స్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.

ఇక ఇదే బ్యాండ్‌కు చెందిన గెలాక్సీ ఫిట్ ఇ వేరియెంట్‌ను కూడా లాంచ్ చేశారు. ఇందులో 0.74 ఇంచ్ డిస్‌ప్లే, 128 కేబీ ఇంట‌ర్న‌ల్ ర్యామ్‌, 4 ఎంబీ స్టోరేజ్‌, బ్లూటూత్, హార్ట్ రేట్ మానిట‌ర్‌, 70 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 5 ఏటీఎం వాట‌ర్‌, డ‌స్డ్ రెసిస్టెన్స్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. గెలాక్సీ ఫిట్ స్మార్ట్‌బ్యాండ్ రూ.7,108 ధ‌ర‌కు మే 31వ తేదీ నుంచి వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుండ‌గా, గెలాక్సీ ఫిట్ ఇ బ్యాండ్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

825

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles