శాంసంగ్ గెలాక్సీ బ‌డ్స్ విడుద‌ల


Thu,February 21, 2019 05:26 PM

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ బ‌డ్స్ పేరిట వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను తాజాగా విడుద‌ల చేసింది. గెలాక్సీ ఎస్‌10 ఈవెంట్‌లోనే వీటిని శాంసంగ్ విడుద‌ల చేసింది. వీటిల్లో ఎన్‌హాన్స్‌డ్ ఆంబియంట్ సౌండ్ టెక్నాల‌జీని ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఈ ఇయ‌ర్ బ‌డ్స్‌తో మ్యూజిక్ వినేట‌ప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వ‌చ్చే శ‌బ్దాలు త‌క్కువ‌గా వినిపిస్తాయి. ఈ ఇయ‌ర్‌బ‌డ్స్‌లో 58 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీన్ని ఫుల్ చార్జింగ్ చేస్తే 6 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. అలాగే ఈ ఇయ‌ర్ బ‌డ్స్‌తో ప్ర‌త్యేక చార్జింగ్ కేస్‌ను అందిస్తున్నారు. దాంతో మ‌రో 7 గంటల పాటు నాన్‌స్టాప్‌గా ఇయ‌ర్ బ‌డ్స్‌లో మ్యూజిక్ విన‌వ‌చ్చు. ఈ కేస్ 252 ఎంఏహెచ్ బ్యాట‌రీని క‌లిగి ఉంది. ఇక గెలాక్సీ బ‌డ్స్‌లో బిక్స్‌బీకి సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి త‌దిత‌ర ఫీచ‌ర్లు కూడా ఈ ఇయ‌ర్ బ‌డ్స్‌లో ఉన్నాయి. రూ.9,245 ధ‌ర‌కు ఈ ఇయ‌ర్ బ‌డ్స్ వినియోగ‌దారుల‌కు మార్చి 8వ తేదీ నుంచి ల‌భ్యం కానున్నాయి.

1922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles