నాలుగు బ్యాక్ కెమెరాల‌తో విడుదలైన గెలాక్సీ ఎ9 (2018) స్మార్ట్‌ఫోన్


Tue,November 20, 2018 03:48 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ9 (2018)ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గెలాక్సీ ఎ సిరీస్‌లో వచ్చిన టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయగా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

గెలాక్సీ ఎ9 2018 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 24, 10, 8, 5 మెగాపిక్సల్ కెమెరాలు నాలుగింటిని ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.36,990 ఉండగా, 8 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.39,990 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఎయిర్‌టెల్ స్టోర్స్‌లలో ఈ ఫోన్‌కు ప్రీబుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించారు. ఈ ఫోన్‌ను ఈ నెల 28వ తేదీ నుంచి విక్రయించనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ9 2018 ఫీచర్లు...

6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 10, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1880

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles