4 బ్యాక్ కెమెరాలతో విడుదలైన గెలాక్సీ ఎ9 2018 స్మార్ట్‌ఫోన్


Thu,October 11, 2018 03:30 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ9 2018 ను ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.51,300 ధరకు నవంబర్ నుంచి మార్కెట్‌లో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉన్నాయి. 24, 8, 10, 5 మెగాపిక్సల్ కెమెరాలు ఈ ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే ఉంది. 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. 3800 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ9 2018 ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 8, 10, 5 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1999

More News

VIRAL NEWS

Featured Articles