ట్రిపుల్ బ్యాక్ కెమెరాలతో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 స్మార్ట్‌ఫోన్


Tue,September 25, 2018 03:11 PM

శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ7 2018ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ట్రిపుల్ బ్యాక్ కెమెరాలను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో 24, 8, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలు ఫోన్ వెనుక భాగంలో ఉంటాయి. అలాగే ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. మొత్తం నాలుగు కెమెరాలు పవర్‌ఫుల్ క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలను షూట్ చేస్తాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 స్మార్ట్‌ఫోన్‌లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ఓ వైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇందులో డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.23,990 ధరకు విక్రయిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.28,990 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌తోపాటు శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో రేపటి నుంచి విక్రయించనున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను విక్రయిస్తారు. ఇక ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2174

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles