ట్రిపుల్‌ బ్యాక్ కెమెరాలతో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 స్మార్ట్‌ఫోన్


Thu,September 20, 2018 02:56 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ7 2018 ను తాజాగా విడుదల చేసింది. రూ.29,385 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 24, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. మొత్తం కెమెరాలన్నీ నాణ్యమైన ఫొటోలు, వీడియోలను తీస్తాయి. ఈ ఫోన్ 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు...


6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1725

More News

VIRAL NEWS

Featured Articles