శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ2 కోర్ ఆండ్రాయిడ్ గో ఎడిష‌న్ స్మార్ట్‌ఫోన్


Mon,March 18, 2019 11:18 AM

శాంసంగ్ కంపెనీ త‌న నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ2 కోర్ ను ఈ నెల 22వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఇందులో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో సింగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫ్లాష్ స‌దుపాయం ఉంది. అలాగే ముందు భాగంలో కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఎగ్జినోస్ 7870 ప్రాసెస‌ర్, 1 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన మిగిలిన స్పెసిఫికేష‌న్ల వివ‌రాల‌ను శాంసంగ్ వెల్ల‌డించ‌లేదు. కానీ మ‌రో రెండు రోజుల్లో ఆ వివ‌రాలు కూడా తెలుస్తాయి. అలాగే ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను కూడా ఇంకా వెల్ల‌డించ‌లేదు.

1409

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles