క్రోమ్‌బుక్ ప్లస్ వి2 ను విడుదల చేసిన శాంసంగ్


Sat,October 13, 2018 06:25 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన క్రోమ్‌బుక్ డివైస్ క్రోమ్‌బుక్ ప్లస్ వి2ను తాజాగా విడుదల చేసింది. నిజానికి ఈ ఏడాది జూన్‌లోనే ఈ డివైస్‌పై శాంసంగ్ ప్రకటన చేసింది. కానీ తాజాగా దీన్ని విడుదల చేసింది. ఇందులో 4జీ సిమ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఇందులో 4జీ సిమ్‌ను వేసుకోవచ్చు. ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్‌ను ఈ క్రోమ్‌బుక్‌లో ఏర్పాటు చేశారు. అలాగే ఈ క్రోమ్‌బుక్‌లో 12.2 ఇంచెస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు రెండు, 4కె డిస్‌ప్లే అవుట్‌పుట్, 1 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.44వేలు. నవంబర్ 2 నుంచి అమెరికా మార్కెట్‌లో ఈ క్రోమ్‌బుక్‌ను విక్రయిస్తారు. తరువాత మిగిలిన దేశాల్లోనూ అందుబాటులోకి వస్తుంది.

2797

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles