జియో ఆఫర్.. కస్టమర్లందరికీ 8 జీబీ ఫ్రీ డేటా..


Sat,May 26, 2018 02:12 PM

రిలయన్స్ జియో గత నెలలో తన కస్టమర్లందరికీ 8 జీబీ డేటాను ఉచితంగా ఇచ్చింది గుర్తుంది కదా. రోజుకు 2 జీబీ డేటా చొప్పున 4 రోజుల వాలిడిటీతో ఈ డేటాను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది. అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా మరో 8 జీబీ డేటాను తన కస్టమర్లందరికీ జియో ఉచితంగా ఇస్తున్నది. ఈ డేటా ఇప్పటికే కస్టమర్ల అకౌంట్‌లో యాడ్ అయిపోయి ఉంటుంది కనుక దాన్ని నేరుగా వాడుకోవచ్చు. అందుకు ఎలాంటి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన పనిలేదు. అదేవిధంగా ఆ డేటాను మై జియో యాప్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు కూడా. ఐపీఎల్ సీజన్ ముగుస్తున్న సందర్భంగా జియో ఈ డేటాను క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ కింద అందిస్తున్నది.

12217

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles