జియో సెలబ్రేషన్ ప్యాక్.. రోజుకు 2 జీబీ డేటా ఫ్రీ


Fri,March 15, 2019 06:29 PM

సంచలనాల జియో.. సెలబ్రేషన్ ప్యాక్‌ను ప్రకటించింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో జియో రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించిన జియో.. తాజాగా ఇదే ఆఫర్‌ను మళ్లీ ప్రకటించింది. జియో సెలబ్రేషన్ ప్యాక్ ప్రకారం.. యూజర్లకు రోజుకు 2జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఈరోజు నుంచి మార్చి 17 వరకు జియో ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో యూజర్లు ఈ ఆఫర్‌తో రోజుకు 2 జీబీ డేటా అంటే మూడు రోజుల వరకు 6 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్‌తో కేవలం డేటా మాత్రమే ఉచితంగా వస్తుంది.

యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి.. మై ప్లాన్స్ సెక్షన్‌లో కరెంట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటే.. అందులో జియో సెలబ్రేషన్ ప్యాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు. అయితే.. ఈ ఆఫర్ అందరికీ కనిపించదు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత మరికొంతమంది యూజర్లకు ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు జియో ప్రకటించింది.

15947

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles