జియో బంపర్ ఆఫర్.. యూజర్లందరికీ ఉచితంగా 8 జీబీ డేటా..!


Mon,April 30, 2018 05:43 PM

రిలయన్స్ జియో తన కస్టమర్లందరికీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న ప్రతి వినియోగదారుడికి 8 జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నది. దీన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఎలాంటి లింక్‌ను విజిట్ చేయాల్సిన పనిలేదు. ఏ ప్యాక్‌ను వేసుకోవాల్సిన అవసరం లేదు. జియో 8జీబీ డేటాను ఆటోమేటిక్‌గా కస్టమర్ల అకౌంట్లకు యాడ్ చేసింది. కావాలంటే ఎవరైనా జియో యాప్‌లోకి లాగిన్ అయి తమకు యాడ్ అయిన డేటా వివరాలను తెలుసుకోవచ్చు. ఈ డేటా క్రికెట్ ప్యాక్ కింద యాడ్ అయింది.

జియో టీవీ యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను వీక్షించే వెసులుబాటును జియో కల్పించిన విషయం విదితమే. దీంతోపాటు అనేక చానల్స్‌ను కూడా ఆ యాప్‌లో చూసేందుకు వీలుంది. ఈ క్రమంలోనే నాణ్యమైన ప్రసారాలను, సేవలను అందిస్తున్నందున జియో టీవీ యాప్‌కు బెస్ట్ మొబైల్ వీడియో కంటెంట్ అవార్డు వచ్చింది. జీఎస్‌ఎంఏ గ్లోబల్ మొబైల్ అవార్డుల్లో భాగంగా జియో ఈ అవార్డును కైవసం చేసుకుంది. దీంతో జియో అందుకు బహుమతిగా 8 జీబీ డేటాను యూజర్లకు ఉచితంగా యాడ్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ డేటాను రోజుకు 2జీబీ చొప్పున 4 రోజుల్లో వాడుకోవాల్సి ఉంటుంది.

17044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles