జియో బంపర్ ఆఫర్.. త‌క్కువ రేట్ల‌కే కొత్త ప్లాన్లు..!


Mon,October 21, 2019 04:08 PM

టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తాను అందిస్తున్న పలు ప్లాన్ల రేట్లను తగ్గించి నూత‌న ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే వాటిలో నాన్-జియో కాల్స్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలో ఇతర టెలికాం కంపెనీలకు జియో మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.

నాన్ జియో కాల్స్‌కు జియో ప్రస్తుతం వినియోగదారుల నుంచి నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తున్న విషయం విదితమే. కాగా ఆ కాల్స్ కోసం ప్రత్యేకంగా రీచార్జి చేసుకోవాల్సి వస్తుండడంతో, ఆ ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను జియో పలు ప్లాన్ల రేట్లను తగ్గించి, వాటిలో నాన్ జియో కాల్స్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలోనే రూ.222, రూ.333, రూ.444, రూ.555 ఆలిన్ వ‌న్ ప్లాన్లను జియో ప్రవేశపెట్టింది. కాగా గతంలో ఉన్న రూ.448 ప్లాన్ కస్టమర్లకు ఇప్పుడు రూ.4 తక్కువకే రూ.444కు లభిస్తుండగా, రూ.396 ప్లాన్ రూ.333 అయింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అందించిన ప్లాన్ల కన్నా ఈ కొత్త ప్లాన్లు వినియోగదారులకు 20 నుంచి 50 శాతం తక్కువ రేట్లకే లభ్యం కానున్నాయి.

ఇక రూ.222 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉండగా, రూ.333 ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఈ రెండు ప్లాన్లలోనూ కస్టమర్లకు 1వేయి నాన్ జియో కాల్స్ ఉచితంగా లభిస్తాయి. అలాగే రూ.444, రూ.555 ప్లాన్ల వాలిడిటీ 84 రోజులు ఉండగా ఈ రెండు ప్లాన్లలో కస్టమర్లకు 3వేల నిమిషాల నాన్ జియో కాల్స్ ఉచితంగా లభిస్తాయి. కాగా ఈ ప్లాన్లన్నింటిలోనూ కస్టమర్లకు నిత్యం 2జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.

9247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles