జియో టీవీ యాప్ వాడేవారికి 10జీబీ ఉచిత డేటా..?


Sun,March 4, 2018 12:16 PM

టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో టీవీ యాప్‌ను వాడే కస్టమర్లకు 10జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిసింది. అది కూడా పలువురు ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ డేటా లభిస్తుందని సమాచారం. కనుక జియో టీవీ యాప్‌ను రెగ్యులర్‌గా వాడే వారు ఎవరైనా తమ జియో అకౌంట్‌లోకి ఒకసారి వెళ్లి చెక్‌ చేసుకుంటే ఉచిత డేటా వచ్చిందీ, రానిదీ సులభంగా తెలుసుకోవచ్చు. ఇక ఈ డేటా లభించే యూజర్లు రోజువారీ డేటా లిమిట్ ప్లాన్‌ను వాడుతున్నట్లయితే ఆ లిమిట్ అయిపోగానే ఈ ఉచిత డేటాను వాడుకునేందుకు వీలుంటుంది. ఈ డేటాను వాడుకునేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు విధించినట్లు తెలిసింది.

7473

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles