పాత జియో ఫోన్ ఇవ్వండి.. జియో ఫోన్ 2 పట్టుకెళ్లండి!


Thu,July 5, 2018 12:29 PM

ముంబై: రిలయన్స్ జియో తన 41వ వార్షిక సమావేశంలో కొత్తగా జియో ఫోన్ 2ను లాంచ్ చేసింది. జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ హైఎండ్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త జియో ఫోన్ 2 క్వెర్టీ కీప్యాడ్‌తో వస్తున్నది. ఈ స్మార్ట్ ఫీచర్ ఫోన్ ఆగస్ట్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.2999. అయితే పాత జియో ఫోన్‌ను ఇచ్చి కొత్త దానిని తీసుకొనే అవకాశం కూడా కల్పించారు. పాత ఫోన్ ఇచ్చే యూజర్లు అదనంగా రూ.500 ఇస్తే చాలు.. ఈ కొత్త జియో ఫోన్ 2 మీ సొంతమవుతుంది. ప్రస్తుతం దేశంలో 2.5 కోట్ల మంది జియోఫోన్ యూజర్లు ఉన్నారు. ఇప్పుడు మేం జియో ఫోన్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్తున్నాం. కొత్త ఫోన్‌లో అదనపు ఫీచర్లు ఉంటాయి అని ఆర్‌ఐఎల్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. దేశంలో మొత్తం జియో యూజర్ల సంఖ్య 21.5 కోట్లకు చేరినట్లు ఆయన వెల్లడించారు.

జియో ఫోన్ 2 ఫీచర్లు


జియో ఫోన్‌లాగే జియో ఫోన్ 2 KaiOSపైనే నడుస్తుంది. ఇందులో 515 ఎంబీ ర్యామ్, 4 జీబీ రోమ్ అందుబాటులో ఉంటుంది. ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు మెమొరీని ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. 2.4 క్యూవీజీఏ డిస్‌ప్లే, 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అయితే జియో ఫోన్‌లో కేవలం ఒకే సిమ్ వేసుకొనే అవకాశం ఉండగా.. ఈ ఫోన్‌లో మాత్రం డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. ఎల్‌టీఈ, వీవోఎల్‌టీఈ, వీవోవైఫైని సపోర్ట్ చేస్తుంది. ఎఫ్‌ఎమ్, బ్లూటూత్, జీపీఎస్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫీచర్ ఫోన్ ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ యాప్‌లను కూడా సపోర్ట్ చేయడనుండటం విశేషం.

1203

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles