జియోఫై హాట్‌స్పాట్‌పై బంపర్ ఆఫర్‌ను అందిస్తున్న జియో..!


Sat,March 3, 2018 01:39 PM

టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియోఫై హాట్‌స్పాట్ డివైస్‌ను కొనుగోలు చేసిన వారికి బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. ఈ డివైస్‌ను రూ.1,999 ధరకు కొనుగోలు చేస్తే రూ.3595 విలువ గల బెనిఫిట్స్‌ను అందిస్తున్నది. ఈ బెనిఫిట్స్‌లో రూ.1295 విలువ గల ఉచిత డేటాతోపాటు మరో రూ.2300 విలువ గల వోచర్లు ల‌భిస్తాయి. వీటిని పేటీఎం, ఆజియో, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో వాడుకుని యూజర్లు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే రూ.1295 విలువైన ఉచిత డేటాను పొందాలంటే యూజర్లు రోజుకు 1.5 జీబీ/2జీబీ/3జీబీ డేటా లభించే ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా జియోఫై ధర రూ.999 మాత్రమే ఉన్నప్పటికీ దాన్ని రూ.1,999 తో కొనుగోలు చేస్తే పైన చెప్పిన ఆఫర్ లభిస్తుంది. అలా కాకుండా ఆఫర్ వద్దనుకుంటే రూ.999కే జియోఫై హాట్‌స్పాట్‌ను కొనుగోలు చేయవచ్చు.

8187

More News

VIRAL NEWS

Featured Articles