మొదలైన జియో గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి


Wed,August 15, 2018 01:13 PM

సంచలనాల రిలయెన్స్ జియో నుంచి మరో సంచలన సర్వీస్ ప్రారంభమవుతున్నది. జియో గిగా ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కస్టమర్లకు 1 జీబీపీఎస్ వరకు స్పీడ్ అందించడమే జియో లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి దీనిపై ఆసక్తి చూపుతూ మాత్రమే కస్టమర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కువ మంది ఆసక్తి చూపారో ముందు ఆ ప్రాంతాల్లో గిగా ఫైబర్ సేవలను సంస్థ ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా 1100 నగరాల్లో గిగా ఫైబర్ సేవలు ప్రారంభించనున్నట్లు గత నెలలోనే రిలయెన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికారికంగా సేవలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్నదానిపై కచ్చితమైన ప్రకటన రాలేదు. గత రెండేళ్లుగా జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను పరీక్షిస్తున్నారు. దీనిని వాడుతున్న యూజర్లు 700 ఎంబీపీఎస్ వరకు స్పీడు వస్తున్నట్లు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.

ఆసక్తి ఉంటే ఇలా రిజిస్టర్ చేసుకోండి


- జియో అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి అందులో గిగాఫైబర్ పేజ్ ఓపెన్ చేయండి
- అక్కడున్న చేంజ్ బటన్‌పై నొక్కి మీ అడ్రెస్‌ను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత సబ్‌మిట్ బటన్ కొడితే డీఫాల్డ్ అడ్రెస్‌ను చూపిస్తుంది. ఇది మీ ఇంటి అడ్రెసా లేక ఆఫీస్ అడ్రెసా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి
- ఆ తర్వాతి పేజీలో మీ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ బటన్ నొక్కండి
- మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మీ లొకాలిటీ (సొసైటీ, టౌన్‌షిప్, డెవలపర్‌లాంటివి) సెలెక్ట్ చేసి సబ్‌మిట్ కొట్టండి

అంతే జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అంతేకాదు మీరు ఇతర ప్రాంతాలను కూడా నామినేట్ చేయొచ్చు. అంటే మీరు పని చేసే చోటు లేదా ఇతర స్నేహితులు, ఇంకా ఎవరిదైనా అడ్రెస్‌పై కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో హైస్పీడ్ వైఫై కవరేజ్‌తోపాటు కంపెనీకి చెందిన గిగా టీవీ, స్మార్ట్‌హోమ్‌లాంటివి కూడా యాక్టివేట్ అవుతాయి.

18900

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles