రేపు విడుదల కానున్న జియో ఫోన్ 3..?


Sun,August 11, 2019 12:10 PM

టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన నూతన ఫీచర్ ఫోన్ జియో ఫోన్ 3ని రేపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా రిలయన్స్ నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నూతన జియో ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రేపు జరగనున్న రిలయన్స్ ఏజీఎంలో జియో ఫోన్ 3 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఇక గతంలో వచ్చిన జియో 4జీ ఫీచర్ ఫోన్లతో పోలిస్తే జియో ఫోన్ 3లో నూతనంగా టచ్ సదుపాయం ఉన్న డిస్‌ప్లేను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక దీంతోపాటు వాయిస్, వీడియోకాల్స్‌ను మరింత మెరుగ్గా అందించేలా పలు నూతన సదుపాయాలను కూడా జియో ఫోన్ 3లో అందివ్వనున్నట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ గురించిన మరిన్ని వివరాలు తెలియాలంటే రేపటి వరకు వేచి చూడక తప్పదు.

13236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles