రెడ్మీ గో.. షియోమీ ఫోన్లలోనే అత్యంత తక్కువ ధర.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?


Sat,March 16, 2019 03:33 PM

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంటే మీకు షియోమీ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేరుకు చైనా కంపెనీ అయినా.. భారత్‌లో ఎక్కువ మంది ఉపయోగించేది షియోమీ ఫోన్ల‌నే. అందులో రెడ్మీ మోడల్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. అవి లాంచ్ అవడం ఆలస్యం క్షణాల్లో లక్షల ఫోన్లు బుక్కయిపోతాయి. రెడ్మీ నోట్ 3.. అప్పట్లో ఇండియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. తక్కువ ధ‌ర‌కు బెస్ట్ ఫీచర్లను అందించడమే షియోమీ ఫోన్ల సీక్రెట్. అందుకే.. వాటికి అంత డిమాండ్. రెడ్మీ నోట్ 3 సక్సెస్‌తో వరుసగా.. వాటి సిరీస్‌లను విడుదల చేస్తూ మార్కెట్‌లో బెస్ట్ బ్రాండ్‌గా నిలిచింది షియోమీ.

అయితే.. షియోమీ తాజాగా రెడ్మీ గో అనే కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కాకపోతే అది ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు. మార్చి 19న భారత్‌లో రిలీజ్ కానుంది. రెడ్మీ గోలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అది షియోమీ ఫోన్లలోనే అత్యంత తక్కువ ధర కలిగిన ఫోన్. అది ఆండ్రాయిడ్ గో ఓఎస్‌తో నడుస్తుంది.

ఆండ్రాయిడ్ గో అంటే?


సాధారణంగా చాలా స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. ఇది గూగుల్ కంపెనీకి చెందిన ప్రాడక్ట్. ఆండ్రాయిడ్ గో కూడా గూగుల్‌దే. కాకపోతే ఇది తక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్‌లో వాడే ఓఎస్. ఉదాహరణకు కొన్ని ఫోన్లలో లిమిటెడ్ స్టోరేజ్‌లు ఉంటాయి. బడ్జెట్ ఫోన్లలో ఎక్కువ ఫీచర్లు ఉండవు కదా. 1 జీబీ రామ్ ఉన్న ఫోన్లు, తక్కువ స్పీడ్ ఉన్న ప్రాసెసర్స్ ఉన్న ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నడవదు. స్ట్రక్ అయిపోతుంది. అటువంటి ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ గో అనే సపరేట్ ఓఎస్‌ను తయారు చేసింది. ఆండ్రాయిడ్‌లో ఇది భాగమే. దీంట్లో వాడే యాప్స్ కూడా చాలా లైట్ వెయిట్ అప్లికేషన్స్. ఉదాహరణకు ఫైల్స్ గో, మ్యాప్స్ గో, యూట్యూబ్ గో.. ఇవి చాలా తక్కువ మెమోరీని ఉపయోగించుకుంటాయి. ప్రాసెసర్ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టవు. ఈ యాప్స్ మామూలు యాప్స్ కంటే 15 శాతం వేగంగా లోడ్ అవుతాయి. అందుకే.. తక్కువ బడ్జెట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ గోను ఉపయోగిస్తున్నారు.

షియోమీ రెడ్మీ గో లో కూడా ఆండ్రాయిడ్ గో ఓఎస్సే ఉంటుంది. దీని ధర 5000 రూపాయలకు తక్కువే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అందుకే.. షియోమీలోనే ఇది అత్యంత తక్కువ ధర ఉన్న ఫోన్. అయితే.. షియోమీ కంటే ముందే.. నోకియా, శామ్‌సంగ్ లాంటి కంపెనీలు ఆండ్రాయిడ్ గోలో ఫోన్స్‌ను తీసుకొచ్చాయి. నోకియా వన్ 4200కు లభిస్తుండగా... శామ్‌సంగ్‌లో 5990 రూపాయలతో ప్రారంభ ధరలు ఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ జే2 కోర్, మైక్రోమాక్స్ భారత్ గో, లావా జెడ్50, నోకియా 2.1 ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ గోతోనే నడుస్తున్నాయి.

సాధారణంగా షియోమీ ఫోన్లలో ఉండే హైఎండ్ స్పెసిఫికేషన్లు మాత్రం ఈ ఫోన్‌లో ఉండవు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రోలో ఉన్న ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉండవు. కానీ.. 18.9 ఆస్పెక్ట్ రేషియోతో హెచ్‌డీ డిస్‌ప్లే, 400 సిరీస్‌తో క్వాల్‌కామ్ ప్రాసెసర్, బ్లూటూత్ 4.2, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 1 జీబీ రామ్ ఫీచర్లు మాత్రం రెడ్మీగోలో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

4908

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles