రియ‌ల్‌మి యో డేస్ సేల్ షురూ.. ఫోన్ల‌పై ఆఫ‌ర్లు..!


Mon,January 7, 2019 05:56 PM

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. యో డేస్ సేల్ ను ఇవాళ ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా టెక్ బ్యాక్‌ప్యాక్‌ను కేవ‌లం రూ.1 కే కొనుగోలు చేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. అలాగే రియ‌ల్ మి (ధ‌ర రూ.9,499), రియ‌ల్ మి 2 ప్రొ (రూ.13,990), రియ‌ల్ మి సి1 (రూ.7,499) ఫోన్ల‌ను ఈ సేల్‌లో విక్ర‌యిస్తున్నారు. ఇక సేల్‌లో భాగంగా రియ‌ల్ మి యు1 ఫోన్‌ను కొనుగోలు చేసిన మొద‌టి 500 క‌స్ట‌మ‌ర్ల‌కు రియ‌ల్‌మి బ‌డ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు. సేల్‌లో రియ‌ల్ మి యు1 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.11,999 ధ‌ర‌కు, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.14,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. దీనిపై మొబిక్విక్ రూ.1వేయి క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్న‌ది. అలాగే జియో వినియోగ‌దారుల‌కు రూ.5,750 విలువైన డేటా బెనిఫిట్స్ ల‌భిస్తాయి. సేల్‌లో భాగంగా రియ‌ల్‌మి బ‌డ్స్‌ను రూ.499కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. మొబిక్విక్‌లో వీటిపై 10 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు.

4049

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles