రియల్‌మి ఎక్స్2 ప్రొ బ్లైండ్ ఆర్డర్ బుకింగ్స్ షురూ..!


Mon,November 18, 2019 12:32 PM

రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్2 ప్రొ ను నవంబర్ 20వ తేదీన భారత్‌లో విడుదల చేయనున్న విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు గాను ఇవాళ్టి నుంచి రియల్‌మి వెబ్‌సైట్‌లో బ్లైండ్ ఆర్డర్ బుకింగ్స్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ ఫోన్‌ను అందరికన్నా ముందుగానే కొనుగోలు చేసే అవకాశాన్ని రియల్‌మి తన కస్టమర్లకు అందిస్తున్నది. ఇందులో భాగంగా వినియోగదారులు రూ.1వేయి చెల్లించి రియల్‌మి ఎక్స్2 ప్రొ ఫోన్‌ను బ్లైండ్ ఆర్డర్ చేయవచ్చు. ఈ క్రమంలో నవంబర్ 20న ఫోన్ లాంచ్ కాగానే ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు (నవంబర్ 21)న మిగిలిన మొత్తాన్ని చెల్లించి వినియోగదారులు ఆ ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో అందరికన్నా ముందుగానే ఈ ఫోన్‌ను వినియోగదారులు డెలివరీ తీసుకోవచ్చు.

కాగా రియల్‌మి ఎక్స్2 ప్రొ ఫోన్‌ను రెడ్‌మీ కె20 ప్రొ, వన్‌ప్లస్ 7టి ఫోన్లకు పోటీగా లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే రియల్‌మి తెలిపింది. ఈ క్రమంలో రియల్‌మి ఎక్స్2 ప్రొ ఫోన్‌లో 6.5 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 12జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలిసింది.

966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles