అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన రియ‌ల్‌మి ఎక్స్ స్మార్ట్‌ఫోన్


Wed,May 15, 2019 04:16 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి ఎక్స్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. అలాగే రియ‌ల్‌మి ఎక్స్ లైట్ పేరిట మ‌రో ఫోన్ ను కూడా రియ‌ల్‌మి విడుద‌ల చేసింది. రూ.15,325 ప్రారంభ ధ‌ర‌కు రియ‌ల్‌మి ఎక్స్ స్మార్ట్‌పోన్ త్వ‌ర‌లో ల‌భ్యం కానుండ‌గా, రూ.12,260 ప్రారంభ ధ‌ర‌కు రియ‌ల్‌మి ఎక్స్ లైట్ స్మార్ట్‌ఫోన్ త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది. ఇక ఈ ఫోన్ల‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

రియ‌ల్‌మి ఎక్స్ ఫీచ‌ర్లు...


6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెసర్‌, 4/6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3765 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

రియ‌ల్‌మి ఎక్స్ లైట్ ఫీచ‌ర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4045 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles