ప్రారంభ‌మైన రియల్‌మి మొబైల్ బొనాంజా సేల్‌.. తగ్గింపు ధ‌ర‌ల‌కు ఫోన్లు..!


Mon,March 25, 2019 10:41 AM

ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియల్‌మి ఇవాళ రియ‌ల్‌మి మొబైల్ బొనాంజా సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు రియల్‌మి ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ సేల్ కొన‌సాగుతున్న‌ది. సేల్‌లో రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఫ్లిప్‌కార్ట్‌లో రియ‌ల్‌మి 3 ఫోన్‌ను విక్రయించ‌నున్నారు. ఈ ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే సేల్‌లో రియ‌ల్‌మి యు1, రియ‌ల్‌మి 2 ప్రొ ఫోన్ల‌ను రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌తో రూ.9,999, రూ.11,990 ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. అలాగే ప‌లు రియ‌ల్‌మి ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా ఈ సేల్‌లో భాగంగా అందిస్తున్నారు.

2648

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles