5 రోజుల్లో 10 లక్షలకు పైగా రియల్‌మి ఫోన్ల అమ్మకం..!


Mon,October 15, 2018 07:55 PM

ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా 10 లక్షలకు పైగా రియల్ మి ఫోన్లను విక్రయించామని ఆ సంస్థ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపింది. సేల్‌లో రియల్ మి సి1 ఫోన్లు 1.10 లక్షలు అమ్ముడయ్యాయని ఆ సంస్థ తెలియజేసింది. ఇక ఈ మధ్యే విడుదలైన రియల్ మి 2 ఫోన్‌కు గాను 40 రోజుల వ్యవధిలో 10 లక్షల యూనిట్లను విక్రయించామని కూడా ఆ కంపెనీ తెలిపింది. దీంతో భారత్‌లో షియోమీ తరువాత రియల్ మి టాప్ సెల్లింగ్ మొబైల్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించిందని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇక ఈ నెల 3వ వారం చివర్లోగా ఫ్లిప్‌కార్ట్‌లో మరిన్ని రియల్ మి ఫోన్లను సేల్‌కు ఉంచుతామని కూడా ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

8219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles