ఈ నెల 25 నుంచి రియల్‌మి మొబైల్ బొనాంజా సేల్‌..!


Sat,March 23, 2019 12:00 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియల్‌మి ఈ నెల 25 నుంచి 28వ తేదీ వ‌ర‌కు రియ‌ల్‌మి మొబైల్ బొనాంజా సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్‌లో రియ‌ల్ మి 3, రియల్‌మి యు1, రియ‌ల్‌మి 2 ప్రొ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్ల‌ను విక్ర‌యించ‌నున్నారు.

సేల్‌లో భాగంగా ఈ నెల 26వ తేదీన మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఫ్లిప్‌కార్ట్‌లో రియ‌ల్ మి 3 ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ఈ సేల్‌లో రియ‌ల్ మి 3కి చెందిన రేడియెంట్ బ్లూ వేరియెంట్‌ను కూడా తొలిసారిగా విక్ర‌యించ‌నున్నారు. కాగా ఈ ఫోన్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 3,11,800 యూనిట్ల వ‌ర‌కు విక్ర‌యించామ‌ని రియ‌ల్‌మి తెలిపింది. ఇక సేల్‌లో రియ‌ల్ మి యు1, రియ‌ల్‌మి 2 ప్రొ ఫోన్ల‌ను కూడా తగ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. సేల్‌లో రియ‌ల్ మి యు1 రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌తో రూ.9,999 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. అలాగే రియ‌ల్‌మి 2 ప్రొ రూ.1వేయి త‌గ్గింపుతో రూ.11,990 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది.

3927

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles