రేపు రియ‌ల్‌మి 3 ప్రొ బ్లైండ్ ఆర్డ‌ర్ సేల్‌..!


Thu,April 18, 2019 06:02 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్ మి త‌న రియ‌ల్‌మి 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 22వ తేదీన విడుద‌ల చేయ‌నున్న విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్‌కు గాను రియ‌ల్‌మి బ్లైండ్ ఆర్డ‌ర్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్ నేటి అర్థ‌రాత్రి 12 నుంచి రేపు అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా యూజ‌ర్ల‌కు ఆర్‌-పాస్ పేరిట ఓ యూనిక్ కోడ్‌ను ఇస్తారు. దీంతో క‌స్ట‌మ‌ర్లు ఈ నెల 29వ తేదీన రియ‌ల్ మి 3 ప్రొ ఫోన్‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ ఆర్-పాస్ ఉన్న‌వారు రియ‌ల్‌మి 3 ప్రొకు చెందిన ఏ క‌ల‌ర్ వేరియెంట్‌ను అయినా కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. కాగా ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్ర‌త్యేకంగా విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్‌కు చెందిన ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

2455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles